Shraddha Kapoor: సౌత్ సినిమాలపై ఆసక్తిని చూపని శ్రద్ధా కపూర్

Saho Movie

  • బాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా శ్రద్ధా కపూర్
  • నిరాశ పరిచిన 'సాహో' ఫలితం 
  • సౌత్ నుంచి వెళ్లిన నిర్మాతలకు నిరాశ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో శ్రద్ధా కపూర్ కూడా కనిపిస్తుంది. అక్కడ వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ ఆమె ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రభాస్ జోడీగా 'సాహో' సినిమాలో అలరించింది. అత్యధిక బడ్జెట్ .. వివిధ భాషల్లో విడుదల అనే సరికి తన కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఆమె ఒప్పేసుకుంది.

 కానీ ఆ సినిమా హిందీలో మినహా మరెక్కడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో శ్రద్ధా కపూర్ కి ఆశించిన స్థాయిలో క్రేజ్ పెరగలేదు. అప్పటి నుంచి ఆమె సౌత్ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపడం లేదట. తెలుగు .. తమిళం నుంచి భారీ ఆఫర్స్ వెళ్లినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరిస్తోందని అంటున్నారు. డేట్లు ఖాళీగా లేవంటూ .. కథ కూడా వినకుండానే వెనక్కి పంపించేస్తోందని చెబుతున్నారు. దాంతో 'సాహో' రిజల్ట్ అమ్మడిని బాగానే హర్ట్ చేసిందని చెప్పుకుంటున్నారు.

Shraddha Kapoor
Prabhas
Saho Movie
  • Loading...

More Telugu News