East Godavari District: స్నేహితుడిపై దాడిచేసి.. డిగ్రీ విద్యార్థినిపై నలుగురు అత్యాచారం

Degree Student Gang Raped by Four in East Godavari
  • తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దారుణం
  • కాలేజీ ఫేర్‌వెల్ అనంతరం స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లిన యువతి
  • ఇటుకబట్టీ వద్ద మాట్లాడుకుంటుండగా దాడి
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దారుణం జరిగింది. ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేటు కళాశాలలో మొన్న ఫేర్‌వెల్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత డిగ్రీ విద్యార్థిని ఒకరు స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లింది.

ఇద్దరూ కలిసి సంగంపుంత కాలనీ వద్ద వున్న ఇటుక బట్టీ సమీపానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా నలుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. యువతి స్నేహితుడిపై దాడిచేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వల్లూరి రామకృష్ణ(కిట్టయ్య), సుంకర సత్యనారాయణ(వెంకన్న), చామంతి మధు, ములకల వీరబాబు తనపై దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
East Godavari District
Degree Student
Gang Rape
Mandapeta

More Telugu News