Corona Virus: ‘కరోనా’పై తెలంగాణ హైకోర్టులో ఓ మహిళ పిటిషన్
- అత్యవసర విచారణ చేపట్టిన న్యాయస్థానం
- ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు ప్రణాళికను రేపు సమర్పించాలి
- ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలి
- ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
‘కరోనా’పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ తెలంగాణ హైకోర్టులో ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ప్రణాళికను న్యాయస్థానానికి రేపు సమర్పించాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించింది.
మురికివాడలు, పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, రేపటి నుంచి హైకోర్టుకి వచ్చే వాళ్లందరికీ మాస్కులు ఇవ్వాలని ఆదేశించింది. కక్షిదారులను కోర్టులకు రావొద్దని వారికి సంబంధించిన లాయర్లు చెప్పాలని, విచారణ ఖైదీలను జైలు సిబ్బంది కనుక హాజరుపరచలేకపోతే వారిని మేజిస్ట్రేట్లు శిక్షించవద్దని న్యాయస్థానం ఆదేశించింది. సభలు, సమావేశాల అనుమతిపై పోలీసులు సమీక్షించాలని సూచించింది.