Manchu Manoj: 'అహం బ్రహ్మాస్మి' నుంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న ఫస్టులుక్

Aham Brahmasmi Movie

  • నిర్మాతగా మారిన మనోజ్ 
  •  సాహసంతో కూడిన ప్రయత్నం 
  • నాలుగు భాషల్లో విడుదల  

వరుస పరాజయాల కారణంగా మంచు మనోజ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవలే ఆయన సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యానర్ పై తనే హీరోగా ఒక సినిమాను నిర్మిస్తున్నట్టు చెప్పాడు. ఈ సినిమాకి 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. తాజాగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి తన ఫస్టులుక్ ను వదిలాడు.

విభూతి రేఖలపై కుంకుమ రేఖను ధరించిన ఆయన లుక్ విభిన్నంగా వుంది. మనోజ్ చెప్పినట్టుగానే ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో .. విభిన్నమైన కాన్సెప్ట్ తో మనోజ్ సాహసంతో కూడిన ప్రయోగమే చేస్తున్నాడు. నిర్మాతగా .. కథానాయకుడిగా ఆయన చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Manchu Manoj
Srikanth Reddy
Aham Brahmasmi Movie
  • Loading...

More Telugu News