Nani: నాని సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్?

Shyam Singa Rai Movie

  • నాని తాజా చిత్రంగా 'వి'
  • తదుపరి సినిమాగా 'శ్యామ్ సింగ రాయ్'
  • దర్శకుడిగా రాహుల్ సాంకృత్యాన్  

నాని తాజా చిత్రంగా 'వి' రూపొందుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 'ఉగాది'కి విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాగా నాని 'శ్యామ్ సింగ రాయ్' చేస్తున్నాడు. కథాపరంగా ఈ సినిమాకి సంగీతం ప్రధాన బలంగా నిలవనుందట. అందువలన ఏఆర్ రెహ్మాన్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట.

ఏఆర్ రెహ్మాన్ పనిచేసిన తెలుగు సినిమాలు చాలా తక్కువ. 'సైరా' వంటి పెద్ద ప్రాజెక్టు నుంచే ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్నాడు. అలాంటప్పుడు ఆయన నాని సినిమా చేయడానికి అంగీకరిస్తాడా? అనేది చూడాలి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మాత్రం నిర్మాతలతో కలిసి ఏఆర్ రెహ్మాన్ ను ఒప్పించే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి వాళ్ల ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

Nani
Rahul i
Shyam Singa Rai Movie
  • Loading...

More Telugu News