'వకీల్ సాబ్' కి హైలైట్ గా నిలవనున్న నివేదా థామస్ రోల్
- హిందీలో హిట్ కొట్టిన 'పింక్'
- తెలుగు రీమేక్ గా 'వకీల్ సాబ్'
- కీలకమైన పాత్రలో నివేదా థామస్
ఈ సినిమాకి ఆమె పాత్ర హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఎమోషన్ తో సాగే ఈ పాత్రలో ఆమె జీవిస్తోందని చెబుతున్నారు. ఈ పాత్రకి మంచి అభినయ సామర్థ్యం కలిగిన నటి అవసరమని భావించే నివేదా థామస్ ను ఎంపిక చేసుకున్నారట. అనుకున్నట్టుగానే ఆమె ఈ పాత్రకి పూర్తి న్యాయం చేస్తోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా తరువాత నివేదా కెరియర్ గ్రాఫ్ మరింత పెరిగిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేసే అవకాశాలు కూడా ఎక్కువని అంటున్నారు.