Bangi Ananthaiah: టీడీపీ నేత, కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం

TDP leader Bangi Ananthaiah suicide attempt

  • కర్నూలులోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం
  • భార్య, కుమార్తె మార్కెట్ కు వెళ్లిన సమయంలో ఘటన
  • రాజకీయంగా అందరూ మోసం చేశారనే ఆవేదనలో బంగి అనంతయ్య

బంగి అనంతయ్య... పరిచయం అవసరం లేని రాజకీయ నాయకుడు. గతంలో కర్నూలు మేయర్ గా సేవలందించిన ఆయన... వివిధ వేషధారణలతో ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలను ఆయన ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. కర్నూలులోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ఆయన పాల్పడ్డారు.

భార్య, కుమార్తె కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్లిన సమయంలో బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆయనను రక్షించారు. అనంతరం హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. బంగి అనంతయ్య ఆత్మాహత్యాయత్నం చేశారనే వార్తతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. రాజకీయంగా తనను అందరూ మోసం చేశారనే ఆవేదనతోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News