Regina Cassandra: రంగంలోకి దిగుతున్న రెజీనా, నివేదా

Sudheer varma Movie

  • సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి మరో రీమేక్ 
  • దర్శకుడిగా సుధీర్ వర్మ 
  • వచ్చేనెల మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు 

యువ దర్శకుడు సుధీర్ వర్మకి మంచి ఇమేజ్ వుంది. అయితే ఇటీవల ఆయన తెరకెక్కించిన 'రణరంగం' పరాజయాన్ని చవిచూసింది. దాంతో తదుపరి సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. కొరియన్ మూవీ అయిన 'మిడ్ నైట్ రన్నర్స్' సినిమాను రీమేక్ చేయడానికి రంగంలోకి దిగాడు.

ఈ సినిమాలో ప్రధాన పాత్రలకిగాను రెజీనాను .. నివేదాను తీసుకున్నారు. కొరియన్ సినిమాకి పని చేసిన స్టంట్ మాస్టర్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. వాళ్ల దగ్గరే రెజీనా - నివేదా శిక్షణ తీసుకున్నారు. ఈ నెల మూడవ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి రెజీనా .. నివేదాలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ఈ ఇద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Regina Cassandra
Niveda Thomas
Sudheer Varma Movie
  • Loading...

More Telugu News