Ravi Shankar: నాన్న సంపాదన బొటాబొటీగా ఉండేది .. సాయికుమార్ సపోర్టుగా నిలిచాడు: 'బొమ్మాళీ' రవిశంకర్

Tharangini Movie

  • మా నాన్న మా అందరినీ బాగా చదివించాడు 
  • మా అన్నయ్య మా ఇంటి దైవం 
  • వదినకి హ్యాట్సాఫ్ చెబుతున్నానన్న రవిశంకర్

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ మాట్లాడుతూ, తమ కుటుంబ విషయాలను పంచుకున్నారు. "మా అమ్మానాన్నలకి మేము ఐదుగురం సంతానం. అందరినీ ఆయన డిగ్రీలు .. మాస్టర్ డిగ్రీలు చదివించారు. ఎవరికి దేనిపట్ల ఆసక్తి వుంటే అది నేర్చుకోమనేవారు. అయితే ఆయన సంపాదన బొటాబొటిగా ఉండటంతో, మా కోసం చాలా కష్టపడ్డారు.

1982 నుంచి అన్నయ్య సాయికుమార్ అందుకున్నాడు. 'తరంగిణి' సినిమాతో తన కెరియర్ ను మొదలెట్టి కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఇద్దరు సిస్టర్స్ పెళ్లిళ్లు చేశాడు. నాన్నతో కలిసి మా అవసరాలు తీరుస్తూ వచ్చాడు. అన్నయ్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మా కుటుంబానికి దేవుడిలాంటివాడనే చెబుతాను. అన్నయ్యను అర్థం చేసుకుని సహకరించిన మా వదిన ఇంకా గ్రేట్ అని చెబుతాను. ఈ వేదిక ద్వారా మా వదినకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను" అన్నారు.

Ravi Shankar
Sai Kumar
P.J. Sharma
Tharangini Movie
  • Loading...

More Telugu News