Ramcharan: త్రివిక్రమ్ ను .. కొరటాలను లైన్లో పెట్టేసిన చరణ్

Koratala Siva Movie

  • రాజమౌళి సినిమాతో బిజీగా చరణ్ 
  • తదుపరి సినిమా కొరటాలతో 
  • త్రివిక్రమ్ తోను పూర్తయిన చర్చలు

యువతరం స్టార్ హీరోలు చాలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. తప్పకుండా హిట్ ఇస్తారు అనే దర్శకులను ముందుగానే లైన్లో పెట్టేస్తున్నారు. సినిమాకి .. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. చరణ్ కూడా ప్రస్తుతం అదే పనిలో వున్నాడు.

ప్రస్తుతం చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. గతంలోనే ఈ కాంబినేషన్లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లవలసింది .. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇక కొరటాల తరువాత చరణ్ .. త్రివిక్రమ్ తో చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన మాటామంతీ పూర్తయినట్టుగా చెబుతున్నారు. ఇక ముందుగా త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న ఎన్టీఆర్, ఆ తరువాత సినిమాను కొరటాలతో చేయనుండటం విశేషం.

Ramcharan
Koratala Siva
Trivikram Srinivas
Junior NTR
  • Loading...

More Telugu News