Bollywood: ఆత్మ రక్షణ కోసమే అలా చేశా: హీరోయిన్ యామీ గౌతమ్‌

My Reaction Was Self Defence

  • అసోం సంప్రదాయాలను అవమానించిందని విమర్శలు  
  • శాలువా వేసేందుకు వస్తున్న వ్యక్తిని కోప్పడిన నటి
  • అనుమతి లేకుండా దగ్గరకు రావడంతోనే అలా చేశానని వివరణ

అసోం సంప్రదాయాలను అవమానించానని తనపై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ నటి యామీ గౌతమ్ స్పందించింది. గ్రేట్ గువాహటి మారథాన్‌ను ప్రారంభించేందుకు యామీ ఆదివారం గువాహటికి వచ్చింది. అయితే, ఎయిర్‌‌పోర్టులో ఆమెకు స్వాగతం పలికేందుకు ఓ అభిమాని అసోం సంప్రదాయ పద్ధతిలో గమోసా (శాలువా) వేసేందుకు ప్రయత్నించాడు.

తన అనుమతి లేకుండానే అతను దగ్గరికి రావడంతో యామీ గమోసాను తిరస్కరించింది. అతనిపై కోప్పడి  వెంటనే  కారు ఎక్కింది. ఈ వీడియోను అసోంకు చెందిన ఓ మీడియా సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. అసోం సంస్కృతిని యామీ అవమానపరిచిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

దీనిపై ట్విట్టర్ వేదికగా యామీ గౌతమ్ స్పందించింది. సదరు వ్యక్తి అనుమతి తీసుకోకుండానే తన దగ్గరికి వచ్చాడని, ఆత్మ రక్షణ కోసమే తాను అలా ప్రవర్తించానని తెలిపింది. ఒక తెలియని వ్యక్తి దగ్గరికి వస్తే మహిళగా తాను అసౌకర్యంగా భావిస్తానని చెప్పింది. తన స్థానంలో ఎవరున్నా ఇలానే ప్రవర్తిస్తారని చెప్పింది. అంతేగానీ ఎవరి మనోభావాలు దెబ్బ తీసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసింది.

Bollywood
actress
yami gautam
assam
gamosa
  • Loading...

More Telugu News