Team India: టీమిండియా ఓటమిపై స్పందించిన విరాట్​ కోహ్లీ

We made too much of the conditions says kohli and underlines mental hurdles

  • పరిస్థితుల గురించి అతిగా ఆలోచించి తప్పు చేశాం
  • బ్యాట్స్‌మెన్‌లో స్పష్టత లేకపోవడమే ముంచింది
  • తప్పిదాలను సమీక్షించి నేర్చుకుంటాం

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవడంపై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. కివీస్‌లో పరిస్థితుల గురించి అతిగా ఆలోచించి బ్యాట్స్‌మెన్‌ తప్పు చేశారని అన్నాడు. తమ ఆలోచనల్లో సంఘర్షణ వల్లే సిరీస్‌లో ఓడిపోయామని అన్నాడు. ఇక్కడ ఎలా ఆడాలో బ్యాట్స్‌మెన్‌కు  ఓ క్లారిటీ లేకపోవడం తమను దెబ్బకొట్టిందని అన్నాడు.

గతంలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బాగా ఆడామని గుర్తు చేశాడు. అప్పుడు తామంతా ఓ స్పష్టమైన ఆలోచనా దృక్పథంతో ఉన్నామన్నాడు. ఈ సిరీస్‌లో అది లోపించిందన్నాడు. టెస్టులు ఆడుతున్నప్పుడు ప్రతి రోజు, ప్రతి సెషన్‌, ప్రతి పరిస్థితిలో సానుకూలంగా ఆలోచించాల్సి ఉంటుందని అన్నాడు. కానీ, తమ బ్యాటింగ్ విభాగం మొత్తం ఫెయిలైందని, తొలి టెస్టు తొలి రోజు నుంచే పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించి తప్పు చేశామని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమి తమకు ఓ పాఠం లాంటిదన్నాడు. సిరీస్‌లో చేసిన తప్పిదాలను సమీక్షించుకొని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News