Kuna Ravi kumar: ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్​ అరెస్టు

TDP Leader Ravi kumar arrest

  • తనపై దుర్భాషలాడారని సరబుజ్జిలి ఈవోపీఆర్డీ ఫిర్యాదు
  • ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
  • కేసు వివరాలు అడిగేందుకు పీఎస్ కు వెళ్లిన కూన అరెస్టు

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. సరబుజ్జిలి ఈవోపీఆర్డీ వెంకటప్పలనాయుడు ఫిర్యాదు మేరకు రవికుమార్ పై కేసు నమోదు చేశారు. రవికుమార్ తనపై ఫోన్ లో దుర్భాషలాడినట్టు తన ఫిర్యాదులో ఆరోపించారు.

కాగా, ఆముదాలవలసలో టీడీపీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రాంతం వద్దకు వెళ్లిన పోలీసులు కూన రవికుమార్ కు ఈ విషయం తెలిపారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో చెప్పాలని పోలీసులను రవికుమార్ అడిగినట్టు సమాచారం. కేసు వివరాలు తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రవికుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Kuna Ravi kumar
Telugudesam
Aamudalavalasa
Arrest
  • Loading...

More Telugu News