Adivi Sesh: షూటింగు దశలో 'మేజర్'

Major Movie

  • బయోపిక్ లో అడివి శేష్ 
  • రెండోసారి జోడీ కట్టిన శోభిత ధూళిపాల 
  •  హిమాచల్ ప్రదేశ్ లో చిత్రీకరణ

మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. 'గూఢచారి' సినిమా ఆయన క్రేజ్ ను మరింతగా పెంచింది. ఆ క్రేజ్ ను నిలబెట్టుకునే ఉద్దేశంతో కథల విషయంలో ఆయన మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. అలా ఆచి తూచి ఆయన ఎంపిక చేసుకున్న కథతో 'మేజర్' సినిమా రూపొందుతోంది.

2008లో ముంబై టెర్రర్ ఎటాక్ లో ప్రజలను కాపాడటం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్స్ .. సోనీ పిక్చర్స్ .. ఎ ప్లస్ ఎస్ బ్యానర్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. 'గూఢచారి'లో అడివి శేష్ జోడీ కట్టిన శోభిత ధూళిపాల, ఈ సినిమాలోను ఆయన సరసన నటిస్తుండటం విశేషం.

Adivi Sesh
Sobhia Dhulipala
Major Movie
  • Loading...

More Telugu News