YSRCP: 'గున్న గున్న మామిడీ... జీడిగింజలూ..' అంటూ అమ్మాయిలతో నేతల డ్యాన్స్ వైరల్‌.. విమర్శలు

ycp workers dance with girls

  • ఒంగోలులో ఘటన
  • ఏపీ మంత్రి బాలినేని అనుచరుడు నల్లమలుపు కృష్ణారెడ్డి బర్త్‌ డే వేడుక
  • రేవ్‌ పార్టీ చేసుకున్నారంటూ విమర్శలు

సినీనటుడు రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలోని  'గున్న గున్న మామిడీ... జీడిగింజలూ..' పాటకు ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు డ్యాన్స్‌ చేసిన వీడియో బయటకు వచ్చింది. రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసి అమ్మాయిలతో చిందులు వేసిన వారి తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఏపీ మంత్రి బాలినేని అనుచరుడు నల్లమలుపు కృష్ణారెడ్డి (బుల్లెట్‌ కృష్ణారెడ్డి) తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ పార్టీ కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్‌లో జరిగింది. ఇలా వారు గార్డెన్స్‌లో హంగామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రి అనుచరుడే ఇలా రేవ్ పార్టీలు పెట్టడంపై కొందరు మండిపడుతున్నారు.

YSRCP
Prakasam District
  • Loading...

More Telugu News