Jabardasth: అవార్డులు గెలుచుకున్న 'జబర్దస్త్' నటులు

awards to jabardasth actors

  • సుడిగాలి సుధీర్, ఆటో రామ్‌ ప్రసాద్‌తో పాటు పలువురికి అవార్డులు
  • 'లాఫ్టర్‌ అవార్డ్‌ 2020' పేరిట అవార్డులు 
  • అందించిన విక్రమ్‌ ఆర్ట్స్‌ విక్రమ్‌ ఆదిత్య రెడ్డి 
  • బంజారా హిల్స్‌లోని ఓ హోటల్‌లో కార్యక్రమం 

'జబర్దస్త్' నటులు సుడిగాలి సుధీర్, ఆటో రామ్‌ ప్రసాద్‌తో పాటు బుల్లెట్‌ భాస్కర్, అప్పారావు, రాము, రాకింగ్‌ రాకేశ్ తదితరులకు 'లాఫ్టర్‌ అవార్డ్‌ 2020' అవార్డులు దక్కాయి. విక్రమ్‌ ఆర్ట్స్‌ విక్రమ్‌ ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది.

మనిషిని నవ్వించే వారు కూడా వైద్యులే అనే కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందించారు. అవార్డులు అందుకున్న వారిలో చాలా మంది జబర్దస్త్‌ నటులే ఉండడం గమనార్హం.

ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన రసమయి బాలకిషన్‌ పాటలు పాడి అందరిలోనూ జోష్ నింపారు. అనంతరం ఈ కార్యక్రమంలో బి ప్రిపేర్డ్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌ను విడుదల చేశారు. జబర్దస్త్‌ నటులంతా ఒకే చోట చేరి సందడి చేశారు.

  • Loading...

More Telugu News