New Delhi: ఢిల్లీ అల్లర్లపై లోక్‌సభలో కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం

cogress demand for debate on delhi rides

  • నోటీసు ఇచ్చిన  ప్రతిపక్ష నేత రంజన్‌ చౌదరి
  • మరో నాలుగు పార్టీలు కూడా వేర్వేరుగా నోటీసులు
  • ఈరోజు నుంచి రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

ఈశాన్య ఢిల్లీని అట్టుడికించిన అల్లర్లపై లోక్‌సభలో చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ  వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. సభలో ఆ పార్టీ నేత రంజన్‌ చౌదరి ఈ మేరకు నోటీసును స్పీకర్‌కు అందజేశారు. అలాగే, శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఏఐఏంఐఎం, డీఎంకేలు కూడా వేర్వేరుగా నోటీసులు ఇచ్చాయి.

ఢిల్లీ అల్లర్లపై మొత్తం 23 నోటీసులు అందడం విశేషం. దీంతో ఈరోజు మొదలైన రెండోవిడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఢిల్లీ అల్లర్లపై చర్చించే అవకాశం ఉంది. హోం మంత్రి అమిత్‌షా రాజీనామాకు కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద ఈరోజు ధర్నా చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మొత్తం 46 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

New Delhi
Rides
Congress
  • Loading...

More Telugu News