Priyanka Chopra: భర్తతో కలిసి బీచ్‌ వద్ద గుర్రంపై స్వారీ చేసిన హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఫొటోలు వైరల్

Priyanka Chopra and Nick Jonas enjoy horse riding with oceanside view

  • కాలిఫోర్నియాలో ఎంజాయ్‌ చేసిన ప్రియాంక
  • బీచ్‌లో, పచ్చని ప్రకృతి మధ్య భర్తతో ఫొటోలు
  • పోస్ట్ చేసిన నిక్‌ జొనాస్‌

హీరోయిన్‌ ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి పచ్చని ప్రకృతి మధ్య గుర్రంపై స్వారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిక్‌ జొనాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు.
                             
 ప్రస్తుతం వారు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎంజాయ్‌ చేస్తున్నారు. బీచ్‌ వద్ద, పచ్చని చెట్ల మధ్య గుర్రాలపై తిరుగుతూ వారు ఫొటోలు తీసుకున్నారు. కౌ బాయ్‌ స్టైల్‌లో, బ్లాక్‌ డ్రెస్‌లో వారు దిగిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
                                                                 
ఆదివారం సందర్భంగా వారు ఇలా గుర్రాలపై నిన్న విహారానికి వెళ్లారు. బీచ్‌ వద్ద గుర్రాలపై కూర్చొని ఒకరిని ఒకరు పలకరించుకుంటూ వారు కొన్ని ఫొటోల్లో కనపడ్డారు.

Priyanka Chopra
Bollywood
  • Loading...

More Telugu News