IYR Krishna Rao: ప్రతికూల శక్తులకు అమిత్‌ షా సరైన సమాధానం ఇచ్చారు: ఐవైఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

iyr krishna rao on caa

  • అలజడుల ద్వారా పౌరసత్వ సవరణను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు
  • మీడియాలో ఒక వర్గం అల్పసంఖ్యాక వర్గాల్లో అపోహలు సృష్టించింది
  • ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పే కార్యక్రమాన్ని చేపట్టాలి 

పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తూ పౌరసత్వం ఇచ్చేవరకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ సహా దేశంలోని విపక్షాలన్నీ శరణార్థుల్ని, మైనారిటీలను భయభ్రాంతుల్ని చేస్తూ తప్పుదోవపట్టిస్తున్నాయని అమిత్ షా చెప్పిన వ్యాఖ్యలు ఓ పత్రికలో వచ్చాయి. ఆ వార్తను ఐవైఆర్ పోస్ట్ చేశారు.

'అలజడుల ద్వారా పౌరసత్వ సవరణను ఆపడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు సరైన సమాధానం. మీడియాలో ఒక వర్గం, ముస్లిం నాయకత్వం, వామపక్షాలు ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల్లో అపోహలు సృష్టించడంలో సఫలీకృతం అయ్యాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పే కార్యక్రమాన్ని చేపట్టాలి' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.

IYR Krishna Rao
CAA
BJP
  • Error fetching data: Network response was not ok

More Telugu News