Hyderabad: కేసీఆర్ ది వాడుకుని వదిలేసే మనస్తత్వం : మాజీ ఎంపీ వివేక్ ఘాటు విమర్శలు

KCR selfish one fires vivek

  • తెలుగు రాష్ట్రాల సీఎంలు మిత్రులన్నది ఒట్టి అపోహే 
  • కేవలం కమిషన్ల కోసమే జగన్ తో కేసీఆర్ దోస్తీ
  • ఈ విషయం జగన్ తెలుసుకుంటే ఆయనకే మంచిది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది యూజ్ అండ్ త్రో మనస్తత్వమని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో స్నేహం కూడా ఆయన అవకాశవాద ఎత్తుగడల్లో భాగమేనని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ ఘాటైన విమర్శలు చేశారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక పలుమార్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయిన విషయం, రెండు రాష్ట్రాల అభ్యున్నతి కోసం కలిసి పనిచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్నేహం అంతా ఒట్టిదేనని వివేక్ తోసిపుచ్చారు. కేవలం కమిషన్ల కోసం జగతో కేసీఆర్ స్నేహం నటిస్తున్నారని, ఆ అవసరం తీరాక పక్కన పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యని అన్నారు. ఎవరినైనా వాడుకుని వదిలేయడం కేసీఆర్ రాజకీయమని, ఈ విషయం గుర్తెరిగి మసలు కుంటే జగన్ కే మంచిదని హితవు పలికారు.

Hyderabad
G.vivek
KCR
Jagan
  • Loading...

More Telugu News