China: ఆగని కరోనా మరణ మృదంగం.. 3 వేలు దాటిన మృతుల సంఖ్య

Coronavirus Taking lives continuously around the world

  • చైనాలో కొత్తగా మరో 42 మంది మృతి
  • డ్రాగన్ కంట్రీలో 2,912కు చేరిన మృతుల సంఖ్య
  • కొత్తగా మరో 202 కేసులు నమోదు

చైనాలో మరో 42 మంది మృతి.. 3 వేలు దాటిన కోవిడ్ మృతుల సంఖ్య
కరోనా వైరస్ (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చైనాలో నిన్న మరో 42 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్క చైనాలోనే కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,912కు చేరుకుంది. ఇక, కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య 89 వేలకు చేరుకుంది. వైరస్ సోకిన వారిలో మరణాల రేటు రెండు నుంచి ఐదు శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య అమెరికాలో రెండుకు చేరింది. సింగపూర్‌లో ఉంటున్న జపాన్, మియన్మార్, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందిన నలుగురికి కోవిడ్ సోకింది. దీంతో ఆ దేశంలో ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 106కు పెరిగింది. ఇటలీలో మృతుల సంఖ్య 34కు చేరుకోగా, బాధితుల సంఖ్య 1577కు చేరింది.

China
America
Corona Virus
Covid -19
singapore
  • Loading...

More Telugu News