Rajinikanth: ఢిల్లీ అల్లర్లను అదుపు చేయలేకపోయిన వారు రాజీనామా చేయాలి: రజనీకాంత్ డిమాండ్

 Ready to play any role to maintain peace in country says Rajinikanth

  • రజనీకాంత్‌ను కలిసిన పలువురు ముస్లిం మతపెద్దలు
  • ఈశాన్య ఢిల్లీ ఘటనలపై ఆగ్రహం
  • శాంతి స్థాపన కోసం ఏం చేయడానికైనా సిద్ధమన్న రజనీ

ఈశాన్య ఢిల్లీలో గతవారం జరిగిన హింసాత్మక ఘటనలను ఖండించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లను అదుపు చేయలేకపోయిన వారు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో శాంతి స్థాపన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నిన్న పలువురు ముస్లిం మతపెద్దలు రజనీతో భేటీ అయ్యారు. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సూపర్ స్టార్.. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతి, సామరస్య స్థాపనకు తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్టు రజనీ చెప్పారు.

Rajinikanth
New Delhi
Delhi violence
Tamil Nadu
  • Loading...

More Telugu News