Ivanka Trump: ఇవాంకతో కలిసి దిగినట్టుగా మార్ఫింగ్​ ఫొటోలు పెట్టిన ఇండియన్లు.. బాగున్నాయంటూ ఇవాంక ట్వీట్లు

After Some Indians Photoshops Picture With Her Ivanka Trump Replies

  • తాజ్ మహల్ దగ్గర ఇవాంకా దిగిన ఫొటోల్లో తమ ఫొటోలను చేర్చిన కొందరు
  • ట్విట్టర్ లో ఆ పోస్టులకు ఇవాంకాను ట్యాగ్ చేయడంతో రిప్లై
  • భారతీయుల అభిమానానికి పొంగిపోతున్నట్టుగా వ్యాఖ్య

భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాతో కలిసి ఉన్నట్టుగా కొందరు మార్ఫింగ్ ఫొటోలు తయారు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ట్విట్టర్ లో ఈ ఫొటోలను పెడుతూ ఇవాంకాను కూడా ట్యాగ్ చేయడంతో ఆమె స్పందించారు. తనతో కలిసి దిగినట్టుగా ఉన్న ఫొటోలను రీట్వీట్ చేశారు. తనపై చూపిస్తున్న అభిమానానికి పొంగిపోతున్నట్టుగా కూడా ట్వీట్లలో పేర్కొన్నారు.

బాలీవుడ్ నటుడి ఫొటోతో..

 తాజ్ మహల్ దగ్గర ఇవాంక దిగిన ఫొటోను ఫొటోషాప్ చేసి.. బాలీవుడ్ నటుడు, సింగర్ దల్జీత్ దొసాంజ్ ఆమె పక్కనే కూర్చున్నట్టుగా ఎవరో ఫొటో తయారు చేశారు. ఇవాంకాను ట్యాగ్ చేస్తూ దానిని ట్విట్టర్ లో పెట్టారు.
‘‘నేను, ఇవాంకా. ఆమెను ఎప్పటికైనా తాజ్ మహల్ కు తీసుకెళ్లాలి. అందుకే తీసుకెళ్లా. అంతకన్నా ఏం చేయగలను?” అని క్యాప్షన్ పెట్టారు. దానిపై ఇవాంకా స్పందించారు. దల్జీత్ సింగ్ ను ట్యాగ్ చేస్తూ ‘‘అందమైన తాజ్ మహల్ దగ్గరికి నన్ను తీసుకెళ్లినందుకు థాంక్స్. అదొక అద్భుతం. నేనెప్పటికీ మర్చిపోలేను” అంటూ రీట్వీట్ చేశారు.
అయితే దీనిపై దల్జీత్ స్పందిస్తూ.. ఎవరో ఫొటోషాప్ చేసిన ఫొటో పెడితే.. తనకు ఇవాంకా నుంచి రిప్లై వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

మరికొందరి ఫొటో షాప్డ్ ఫొటోలను కూడా..

తనతో కలిసి ఉన్నట్టుగా ఫొటో షాప్ చేసిన మరికొన్ని ఫొటోలను కూడా ఇవాంకా షేర్ చేశారు. ‘‘భారత ప్రజల అభిమానానికి పొంగిపోతున్నాను. నాకు ఎందరో కొత్త ఫ్రెండ్స్ దొరికారు’’ అంటూ ట్వీట్లు చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇవాంకా స్వయంగా ఈ ఫొటోలను ట్వీట్, రీట్వీట్లు చేసినా.. మొదట ఎవరూ నమ్మలేదు. ఎవరో మార్ఫ్ చేసి పెట్టారని భావించారు. కానీ ఇవాంకానే స్వయంగా ఆ ఫొటోలను షేర్ చేస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.




  • Error fetching data: Network response was not ok

More Telugu News