Amit Shah: పశ్చిమ బెంగాల్‌లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి: అమిత్ షా ధీమా

We Win In 2021 Assembly polls in West Bengal Says Amit shah

  • మూడింట రెండొంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తాం
  • సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
  • దేశంలోని శరణార్ధులందరికీ పౌరసత్వం ఇచ్చి తీరుతాం

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. 2021లో పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాము అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని పేదరికాన్ని పారదోలుతామన్నారు. పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ.. దేశంలోని శరణార్థులందరికీ పౌరసత్వం ఇచ్చి తీరుతామన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు. సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టం  వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం పోదని, అది ఇచ్చేదే తప్ప తీసుకునేది కాదని అమిత్ షా హామీ ఇచ్చారు.

Amit Shah
CAA
Kolkata
West Bengal
  • Loading...

More Telugu News