Mahesh Babu: ప్లీజ్ మహేశ్... ఈ ఒక్క క్యారెక్టర్ నాకు వదిలెయ్...: అల్లు అర్జున్

Allu Arjun Plea to Mahesh Babu

  • ఇంతవరకూ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోని బన్నీ
  • కొరటాల చిత్రంలో మహేశ్ కు పవర్ ఫుల్ పాత్ర
  • అది తనకు కావాలంటున్న అల్లు అర్జున్

మెగాస్టార్ చిరంజీవితో ఇంతవరకూ ఒక్కసారి కూడా స్క్రీన్ ను పంచుకోని అల్లు అర్జున్ ('డాడీ'లో పాట మినహా), కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్న చిత్రంలో మాత్రం అవకాశం వదులుకోరాదని భావిస్తున్నాడట. టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, కొరటాల డైరెక్షన్ చేస్తున్న సినిమాలో 40 నిమిషాల పాటు కనిపించే పవర్ ఫుల్ పాత్రకు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబును సంప్రదించారని, అందుకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తుండగా, మహేశ్ సైతం సానుకూలంగా స్పందించారని సమాచారం.

కొరటాల శివ, మహేశ్ బాబు కాంబినేషన్ లో హిట్ సినిమాలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. కొరటాలతో తనకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని మహేశ్ సైతం చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఓకే చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ఇక్కడో ట్విస్ట్ మొదలైంది. తన మామయ్య చిరంజీవితో కలిసి నటించాలని చానాళ్లుగా అనుకుంటున్న అల్లు అర్జున్ రంగంలోకి దిగాడని తెలుస్తోంది.

ఈ పాత్రను తనకు ఇవ్వాలని, బన్నీనే స్వయంగా మహేశ్ ను సంప్రదించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. తాను చిరంజీవితో నటించాలని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నానని, ఇటువంటి క్యారెక్టర్ ను తనకు వదిలేయాలని మహేశ్ కు చెప్పిన బన్నీ, ఇదే విషయాన్ని రామ్ చరణ్ తోనూ చెప్పాడట. ఈ విషయంలో తన తండ్రి అరవింద్ ను కూడా రంగంలోకి దింపాడని, ఇంతమంది తనపై ఒత్తిడి పెంచుతూ ఉండటంతో కొరటాల మైండ్ కూడా మారే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Mahesh Babu
Chiranjeevi
Allu Arjun
New Movie
Koratala Siva
  • Loading...

More Telugu News