Surya: హిట్ చిత్రాల దర్శకుడితో సూర్య .. టైటిల్ ఖరారు

Aruva Movie

  • సూర్య 39వ సినిమాకి సన్నాహాలు 
  • దర్శకుడిగా హరి 
  • ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్

సూర్య ఒక సినిమా ముగింపు దశకి చేరుకుంటూ వుండగానే, మరో సినిమాను సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ కారణంగానే అప్పుడే ఆయన 37 సినిమాలను పూర్తి చేసేశాడు. 38వ సినిమాను సుధ కొంగర దర్శకత్వంలో చేస్తున్నాడు. తమిళంలో 'సురారై పొట్రు' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా, తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' టైటిల్ తో రానుంది.

ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతూ ఉండగానే, సూర్య మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. హరి దర్శకత్వంలో ఆయన మరో సినిమాను చేయనున్నాడు. గతంలో హరి - సూర్య కలిసి వరుసగా నాలుగైదు హిట్లు కొట్టారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. స్టూడియో గ్రీన్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అరువా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News