surat: తప్పు తెలుసుకుని ఇంటికొచ్చి.. రెండోసారి కూడా పరారైన వధువు తల్లి.. వరుడి తండ్రి!

Surat couple Elope Second time

  • పశ్చాత్తాపంతో ఇంటికొచ్చిన వధువు తల్లిని వెళ్లగొట్టిన భర్త
  • పుట్టింటికి వెళ్లిపోయిన మహిళ
  • అవమానం భరించలేక రెండోసారి పరార్

వధువు తల్లి, వరుడి తండ్రి కలిసి పరారైన ఘటన ఇటీవల సూరత్‌లో సంచలనమైంది. అయితే, తమ తప్పును తెలుసుకుని తిరిగి ఇంటికొచ్చిన వారికి ఎదురైన పరాభవంతో రెండోసారి కూడా పరారయ్యారు. నగరానికి చెందిన హిమ్మత్‌పాండే (46) కుమారుడికి విజాల్‌పురి పట్టణానికి చెందిన శోభనా రావల్ (43) కుమార్తెతో పెళ్లి కుదిరింది. పెళ్లికి ఇరు కుటుంబాలు సిద్ధమవుతున్న తరుణంలో హిమ్మత్‌పాండే, శోభనలు పరారయ్యారు. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనమైంది.

పిల్లలకు పెళ్లి చేయాల్సిన తాము ఇలాంటి పనిచేయడం సరికాదని పశ్చాత్తాప పడిన ఇద్దరూ తిరిగి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఇంటికొచ్చిన శోభనను భర్త అంగీకరించకపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలిసిన పాండే జీర్ణించుకోలేకపోయాడు. అవమానాన్ని భరించడం ఇష్టం లేని ఇద్దరూ తాజాగా మరోమారు కలసి పరారయ్యారు. సూరత్‌లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. కాగా, ఇద్దరికీ యుక్తవయసు నుంచే పరిచయం ఉంది. అప్పట్లో పెళ్లి చేసుకోలేకపోయారు. తాజాగా, పిల్లల పెళ్లి కోసం కలవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి వెళ్లిపోవడానికి కారణమైంది.

surat
Gujarat
Bride Mother
Groom Father
Marriage
  • Loading...

More Telugu News