Ranga Reddy District: గండిపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిపై కర్రలతో దాడి.. పరిస్థితి విషమం

TRS Leader Attacked by Unidentified men

  • నర్సింహపై కర్రలతో తలపై దాడిచేసిన దుండగులు
  • తలపగిలి రక్తస్రావం.. ఆందోళనకరం 
  • ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు

రంగారెడ్డి జిల్లా గండిపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ నర్సింహపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కర్రలతో దాడిచేశారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన నర్సింహ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నార్సింగ్ మునిసిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీ చేసిన నర్సింహ ఓటమి పాలయ్యారు. దుండగులు ఆయన తలపై కర్రలతో బలంగా బాదడంతో తలపగిలి తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Ranga Reddy District
Gandipet
TRS
Attack
  • Loading...

More Telugu News