Kiwis: ఓటమి బాటలో భారత్.. క్లీన్ స్వీప్ దిశగా కివీస్

India going to loss second test

  • 34 పరుగులకే చివరి నాలుగు వికెట్లను కోల్పోయిన భారత్
  • కివీస్ ఎదుట 132 పరుగుల స్వల్ప విజయ లక్ష్యం
  • జట్టును విజయం దిశగా నడిపిస్తున్న కివీస్ ఓపెనర్లు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారతజట్టు ఓటమి ఖాయమైంది. ఓవర్‌నైట్ స్కోరు 90/6తో మూడో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్  కొనసాగించిన కోహ్లీసేన మరో 34 పరుగులు మాత్రమే జోడించి చివరి నాలుగు వికెట్లను కోల్పోయి 124 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఏడు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ప్రత్యర్థికి 132 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్ (35), టామ్ బ్లండెల్‌(31) జట్టును విజయం దిశగా నడిపిస్తున్నారు.

Kiwis
India
Test match
Team India
  • Loading...

More Telugu News