Karimnagar District: రాధికను చంపింది కుటుంబ సభ్యులేనా?.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో నేడు వీడనున్న చిక్కుముడి!

Karimnagar police questions Inter Student Radhikas father

  • గత నెల 10న ఇంట్లోనే దారుణహత్యకు గురైన రాధిక
  • ఆమెను హత్యచేసింది బయటి వ్యక్తులు కాదని నిర్ధారణ
  • తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు

కరీంనగర్‌లో గత నెల 10న దారుణ  హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో ఆమె కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ డేటా, హత్య జరిగిన టవర్‌లోని ఫోన్ కాల్స్ డేటా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా రాధికను హత్య చేసింది బయటి వ్యక్తులు కాదని పోలీసులు నిర్ధారణకొచ్చారు. కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఆమెను హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. తాజాగా, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్న ఆమె ఇంట్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్టు సమాచారం.

ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రాధికను గత నెలలో దుండగులు గొంతు కోసి హత్య చేశారు. రోజు కూలీలైన ఆమె తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసును సీరియస్‌గా తీసుకున్న కమిషనర్ కమలాసన్ రెడ్డి 75 మంది పోలీసులుతో 8 బృందాలను ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేయించారు. దీంతో ఆమెను చంపింది బయటి వ్యక్తులు కాదని తేలింది. నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల పేర్లను పోలీసులు బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Karimnagar District
Inter Student Radhika
Murder
Telangana
  • Loading...

More Telugu News