Asaduddin Owaisi: ఎన్నార్సీ అమలైతే దేశంలో 8 కోట్ల మంది పేర్లు గల్లంతు: అసదుద్దీన్ ఒవైసీ

MIM Chief Asaduddin Owaisi demonds Modi Govt Should Take Responsibility on Delhi violence

  • ఢిల్లీ హింసాకాండకు మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
  • ఎన్నార్సీ అమలు చేయొద్దని ఏపీ, తెలంగాణ సీఎంలకు అభ్యర్థన
  • అసెంబ్లీలో ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానం పెడతాం

దేశంలో ఎన్నార్సీ అమలైతే ముస్లింలు సహా 8 కోట్ల మంది పేర్లు కనిపించకుండా పోతాయని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. మజ్లిస్‌ పార్టీ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసాకాండకు మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మోదీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఎన్‌పీఆర్‌ అమలు చేయొద్దని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను కోరారు. వచ్చే వారం ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెడతారని అసద్ తెలిపారు.

Asaduddin Owaisi
NPR
NRC
MIM
Telangana
  • Loading...

More Telugu News