Mustafa: వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కీలక ప్రకటన

  • సీఏఏ, ఎన్ ఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీర్మానం చేస్తుంది
  • లేనిపక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను
  • ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరించరన్న నమ్మకం ఉంది

వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కీలక ప్రకటన చేశారు. గుంటూరులో నిర్వహించిన సింహగర్జన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్ ఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీర్మానం చేస్తుందని, లేనిపక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరించబోరన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.

Mustafa
YSRCP
CAA
NRC
Jagan
cm
Andhra Pradesh
  • Loading...

More Telugu News