Akshay Kumar: చెన్నైలో ట్రాన్స్ జెండర్ల గృహ నిర్మాణాల కోసం రూ.కోటిన్నరకు చెక్ ఇచ్చిన అక్షయ్ కుమార్

Hero Akshay Kumar donates to transgenders for housing in chennai

  • 'లక్ష్మీ బాంబ్' చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్
  • లారెన్స్ దర్శకత్వంలో చిత్రం
  • ట్రాన్స్ జెండర్ల కోసం ఏదైనా చేయాలనుకున్న లారెన్స్
  • ఇళ్ల నిర్మాణం కోసం భారీ విరాళంతో ముందుకొచ్చిన అక్షయ్ కుమార్

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరోమారు తన పెద్ద మనసు చాటుకున్నారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించే అక్షయ్ కుమార్ తాజాగా, చెన్నైలో ట్రాన్స్ జెండర్ల గృహనిర్మాణాల కోసం రూ.కోటిన్నర విరాళంగా ప్రకటించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ 'లక్ష్మీ బాంబ్' అనే చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకుడు.

లారెన్స్ స్థాపించిన లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా లారెన్స్ తన సంస్థ తరఫున ట్రాన్స్ జెండర్ల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అక్షయ్ కుమార్ ముందుకు రావడంతో చెన్నైలో ట్రాన్స్ జెండర్లకు గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీనిపై లారెన్స్ ఫేస్ బుక్ లో స్పందించారు. అక్షయ్ కుమార్ తమకు దేవుడిలా కనిపిస్తున్నారని కొనియాడారు. ట్రాన్స్ జెండర్ల కష్టాలు విన్న వెంటనే ఎందుకు? ఏమిటి? అని అడగకుండా విరాళం ప్రకటించిన మహానుభావుడని పేర్కొన్నారు.

Akshay Kumar
Transgender
Lakshmi Bomb
Donation
Chennai
Raghava Lawrence
  • Loading...

More Telugu News