Varla Ramaiah: జగన్​ కు ముఖేశ్​ అంబానీకి మధ్య జరిగిన క్విడ్​ ప్రోకో ఏంటి?: వర్ల రామయ్య

Varla Ramaiah questions to Jagan about Ambani meeting

  • నాడు ‘రిలయన్స్’ సంస్థలపై జగన్ దాడులు చేయించారు
  • ఇప్పుడు అంబానీకి స్వాగతం పలికారు!
  • అంబానీకి జగన్ ఏం బహుమతి ఇచ్చారు? 

ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు విమర్శలతో పాటు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, అంబానీకి జగన్ ఏం బహుమతి ఇచ్చారు? వీరి మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఏంటి? అంటూ ప్రశ్నించారు. తన తండ్రిని హత్య చేయించింది ‘రిలయన్స్’ అని అనుమానిస్తూ నాడు ఆ సంస్థలపై జగన్ దాడులు చేయించారని ఆరోపించారు. ఇప్పుడు అంబానీకి ఆయన స్వాగతం పలికారని విమర్శించారు. నాడు ‘రిలయన్స్’పై దాడుల ఘటనలకు సంబంధించిన అనేక మందిపై పోలీస్ కేసులు ఉన్నాయని, అవన్నీ మరిచిన జగన్ కు ‘అధికార మత్తు’ ఎక్కిందని దుయ్యబట్టారు. జగన్–అంబానీ మధ్య జరిగిన ఒప్పందాన్ని బయటపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.  

Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP
Ambani
Reliance
  • Loading...

More Telugu News