Sri Sri Sri Ravishankar: ఢిల్లీ ప్రజలను ఈ స్థితిలో చూడడం బాధగా ఉంది: శ్రీశ్రీశ్రీ రవిశంకర్

Sri Sri Sri Ravishankar visits Delhi

  • ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో రవిశంకర్ పర్యటన
  • బాధితులకు పరామర్శ
  • బాధితులకు సమాజం అండగా నిలవాలని ఆకాంక్ష

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ రవిశంకర్ ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. అల్లర్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పలు ప్రాంతాల్లో ఆయన కాలినడకన తిరిగారు. బాధితులను కలిసి వారిని పరామర్శించారు. ఢిల్లీ ప్రజలను ఈ స్థితిలో చూడడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్ల కారణంగా భీతిల్లిన ప్రజలను సాధారణ స్థితికి తీసుకువచ్చే బాధ్యత అందరిదీనని అన్నారు. ఢిల్లీ అల్లర్లలో గాయపడినవారిని ఇరుగుపొరుగు వారు ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. తద్వారా సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. సీఏఏ వ్యతిరేక నిరసనలు హింసాత్మక రూపుదాల్చడంతో దాదాపు 30 మందికి పైగా మరణించారు. తీవ్రస్థాయిలో ఆస్తినష్టం జరిగింది.

Sri Sri Sri Ravishankar
Delhi
Violence
CAA
  • Loading...

More Telugu News