Komatireddy Venkat Reddy: నల్గొండను దత్తత తీసుకుంటానన్న కేసీఆర్​ అడ్రస్​ లేడు: కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి

Congress MP Komatireddy severe comments on CM KCR

  • ఎంపీగా పోటీ చేసిన నన్ను ఓడించాలని చూశారు
  • నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన కూతురిని ఓడించారు
  • కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి సిద్ధం కావాలి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విరుచుకుపడ్డారు. నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ అడ్రస్ లేడని విమర్శించారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన తనను ఓడించాలని కేసీఆర్ చూశారని, నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన కూతురు కవితను ఓడించి ప్రజలు తగినబుద్ధి చెప్పారని అన్నారు. కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ కేబినెట్ లో మాల సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం దక్కలేదని విమర్శించారు.

Komatireddy Venkat Reddy
Congress
KCR
TRS
Telangana
  • Loading...

More Telugu News