Upasana: వీటిని ఎవరికి ఇవ్వమంటారో చెప్పండి: ఉపాసన

Mega daughter in law Upasana to donate charities

  • ఇంట్లో ఎక్కువైన వస్తువులు, దుస్తులను మూటగట్టిన ఉపాసన
  • ఎంతో శ్రమ, సమయం వెచ్చించానంటూ ట్వీట్
  • దుస్తులను చారిటీ సంస్థలకు నిధుల కోసం అమ్మాలనుకుంటున్నట్టు వెల్లడి

ట్విట్టర్ లో నిత్యం యాక్టివ్ గా ఉండే మెగా కోడలు ఉపాసన కొణిదెల తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. తన ఇంట్లో అల్మైరాలన్నీ శుభ్రంగా సర్ది, అవసరమైనవి మాత్రమే ఉంచుకున్నామని తెలిపారు. ఆ విధంగా ఎన్నో దుస్తులు గుట్టలు పడ్డాయని, వాటిని తాను ఎవరికివ్వాలో చెప్పండంటూ అభిమానులను అడిగారు.

"నా వార్డ్ రోబ్ ను మొత్తం క్లీన్ చేశాక ఎంతో మానసిక ప్రశాంతత లభించింది. అయితే దానికి ఎంతో సమయం, ఎంతో శ్రమ ఖర్చైనా కష్టానికి తగ్గ ఫలితం లభించింది. నాకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడంలో ఎప్పుడూ దుబారా చేయను. చాలా జాగ్రత్తగా వస్తువులు కొంటుంటాను. అయినప్పటికీ కొన్ని దుస్తులను వార్డ్ రోబ్ నుంచి తీసేసి మూటకట్టాను. వాటిని చారిటీ సంస్థలకు నిధులు సేకరించేందుకు అమ్మేయాలని భావిస్తున్నాను. మరి ఎవరికి విరాళంగా ఇస్తే బాగుంటుందో చెప్పండి" అంటూ నెటిజన్ల నుంచి సూచనలు, సలహాలు కోరారు.

Upasana
Wardrobe
Charity
Mega
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News