Anil Kumar Yadav: జగన్ గురించి ఇష్టానుసారం మాట్లాడతామంటే కచ్చితంగా ఊరుకోను: మంత్రి అనిల్​ హెచ్చరిక

Minister Anil kumar yadav says I will never spare if anyone comments on Jagan

  • నన్ను ఎవరేమన్నా భరిస్తా కానీ, జగన్ ని విమర్శిస్తే  సహించను
  • నన్ను ‘రౌడీ’ అని విమర్శించడం కరెక్టు కాదు
  • నేను ఎలాంటి వాడినో నెల్లూరు ప్రజలకు తెలుసు

ఏపీ సీఎం జగన్ పై ఉన్న తన అభిమానాన్ని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోమారు చాటుకున్నారు. తనను ఎవరేమన్నా భరిస్తాను కానీ, జగన్ ని విమర్శిస్తే మాత్రం ఊరుకోనని స్పష్టం చేశారు. జగన్ ని విమర్శించే వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే సహించనని అన్నారు. తనను ‘రౌడీ’ అని విమర్శిస్తుంటారని, అలాంటి వ్యక్తిని కాదని, తమ అధినేత జగన్, నెల్లూరు జిల్లా ప్రజలు తనను మంచిగా అనుకుంటే చాలని, ఎవరేమనుకున్నా తనకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి వాడినో నెల్లూరు ప్రజలకు, తమ కార్యకర్తలకు తెలుసని అన్నారు. అసెంబ్లీలో లేదా ఇంకెక్కడైనా మాట్లాడినప్పుడు కొంచెం దూకుడుగా ఉంటానని, గడ్డంతో ఉన్న తనను చూసి ‘వీడేదో అరుస్తున్నాడు’ అని టీవీల్లో చూసే వాళ్లు అనుకుంటే అనుకోవడంలో తప్పులేదని అన్నారు. జగన్ గురించి ఇష్టానుసారం మాట్లాడతామంటే ‘కచ్చితంగా ఊరుకోను’ అని తేల్చి చెప్పారు.

Anil Kumar Yadav
YSRCP
Jagan
cm
  • Loading...

More Telugu News