Kanna Lakshminarayana: ప్రాంతీయ పార్టీలు స్వార్థంతోనే పనిచేస్తాయి: కన్నా

Kanna Lakshminarayana conducts rally to Tulluru

  • ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా కన్నా ర్యాలీ
  • కన్నావారి తోట నుంచి తుళ్లూరు బయల్దేరిన బీజేపీ నేతలు
  • దురుద్దేశంతోనే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారన్న కన్నా
  • పోలీసుల సాయంతో పాలన సాగిస్తున్నారని విమర్శలు

ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులకు సంఘీభావంగా బీజేపీ నేతలు గుంటూరులోని కన్నా వారి తోట నుంచి ర్యాలీగా తుళ్లూరు బయల్దేరారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, దురుద్దేశంతోనే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు స్వార్థంతోనే పనిచేస్తాయని విమర్శించారు. ప్రస్తుతం జగన్ పరిపాలన పోలీసుల సాయంతోనే జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినవారిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

Kanna Lakshminarayana
BJP
Guntur
Tulluru
Rally
Amaravati
Farmers
  • Loading...

More Telugu News