Mekathoti Sucharitha: ఏపీలో ప్రజలకు అలాంటి రక్షణ ఉంది: హోం మంత్రి సుచరిత

Home minister sucharita says people of have such kind of protection

  • నరసరావుపేటలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం
  • తల్లి గర్భంలో శిశువుకు ఎంత రక్షణ ఉంటుందో ప్రజలకు అలాంటి రక్షణ
  • రాజకీయ లబ్ధి కోసమే పోలీసు శాఖపై చంద్రబాబు నిందలు తగదు

గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లి గర్భంలో శిశువుకు ఎంత రక్షణ ఉంటుందో, అలాంటి రక్షణ ఇప్పుడు ఏపీలో ప్రజలకు ఉందని అన్నారు.

దిశ ఘటన దేశంలో సంచలనం కలిగించిందని, ఇలాంటి సంఘటన ఏపీలో జరగకూడదనే ఉద్దేశంతోనే దిశ చట్టాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని చెప్పారు. మహిళలకు ఆపద వస్తే దిశ యాప్, చట్టాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో పని చేసిన పోలీసులే ఇప్పుడూ కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే పోలీసు శాఖపై చంద్రబాబు నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు.  

Mekathoti Sucharitha
YSRCP
Disa police station
Narasaraopet
  • Loading...

More Telugu News