Yanamala: ఏపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా తయారైంది: యనమల

Yanamala Ramakrishnudu criticises on AP Government

  • సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింది
  • రకరకాల మాఫియాలు సంపదను దోచుకుంటున్నాయి
  • ప్రభుత్వం ఆదాయం దారుణంగా పడిపోయింది

ఏపీలో ప్రభుత్వం చేతగాని తనం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా తయారైందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని, ప్రభుత్వం ఆదాయం దారుణంగా పడిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో రకరకాల మాఫియాలు సంపదను దోచుకుంటున్నాయని, ఇక, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అని ప్రశ్నించారు. విశాఖలో వైసీపీ రౌడీయిజం చేయిస్తోందని ఆరోపించారు. దీని కారణంగా విశాఖలో పెట్టబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. విశాఖలో చంద్రబాబును ఇటీవల అడ్డుకున్న ఘటనపై ఆయన స్పందిస్తూ బాబుపై చెప్పులు, టమాటాలు విసిరింది విశాఖ వాసులు కాదని అన్నారు. ఈ ఘటనను ప్రతిఒక్కరూ ఖండించాలని అన్నారు.

Yanamala
Telugudesam
Andhra Pradesh
YSRCP
Government
  • Loading...

More Telugu News