Narendra Modi: బీహార్​ అభివృద్ధికి నితీష్​ ముఖచిత్రం.. పుట్టినరోజు సందర్భంగా నితీష్​ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Risen From Grassroots PM Modi Wishes Nitish Kumar On His Birthday

  • క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నాయకుడు అంటూ ప్రశంస
  • కలకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్
  • చాలా అంశాల్లో కేంద్ర సర్కారు వెంట నిలిచిన నితీష్

ఆదివారం బీజేపీ సీఎం, జేడీయూ పార్టీ అధినేత నితీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నితీష్ బిహార్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

సామాజిక సాధికారత కోసం కృషి చేశారు

‘‘బిహార్ ముఖ్యమంత్రి, నా స్నేహితుడు నితీష్ కుమార్ జీకి నా శుభాకాంక్షలు. క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన ప్రముఖ నేత ఆయన. బిహార్ రాష్ట్ర అభివృద్ధికి ముఖచిత్రం నితీష్. సామాజిక సాధికారత విషయంగా ఆయన చేస్తున్న కృషి అద్వితీయం. ఆయన కలకాలం చల్లగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా..” అంటూ మోదీ ట్వీట్ చేశారు.

చాలా అంశాల్లో కేంద్ర సర్కారు వెంట..

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన చాలా కీలక అంశాలకు నితీష్ కుమార్ మద్దతు ప్రకటించారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) విషయంగా బీజేపీయేతర పార్టీల్లో తొలుత మద్దతిచ్చింది జేడీయూ పార్టీయే. వచ్చే ఏడాది బిహార్ లో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో భాగంగా జేడీయూ–బీజేపీ కలిసి ఎలక్షన్లకు వెళ్లనున్నాయి.

Narendra Modi
Nitish Kumar
Bihar
  • Error fetching data: Network response was not ok

More Telugu News