Amaravati: అమరావతి రైతుల జలదీక్ష...' సేవ్ అమరావతి' అంటూ నినాదాలు

Amaravathi JAC takes water protest

  • పట్టు విడవని అన్నదాతలు 
  • 75వ రోజుకు చేరిన ఆందోళనలు 
  • ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని ఆవేదన

అమరావతి రైతులు పట్టు సడలించడం లేదు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఇక్కడి రైతు జేఏసీ చేపట్టిన పోరాటం 75వ రోజుకి చేరింది. ఈ రోజు రైతులు జల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం రాష్ట్రాన్ని కులాలు, ప్రాంతాలుగా విభజించారని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రైతుల త్యాగాలను గుర్తించి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మందడంలో రైతులు వంటా వార్పు కార్యక్రమంతో తమ నిరసన తెలిపారు.

Amaravati
rythu JAC
water protest
  • Loading...

More Telugu News