Ranga Reddy District: కానిస్టేబుల్ పెళ్లిలో.. మందేసి చిందేసిన పోలీసులు!

Police men dance in constable marriage

  • రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ కానిస్టేబుల్ రెండో వివాహం
  • పెళ్లి అనంతరం మందుతాగి డ్యాన్స్ చేసిన పోలీసులు
  • సైబరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసిన ఉన్నతాధికారులు

కానిస్టేబుల్ పెళ్లిలో మందేసి చిందేసిన పలువురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్‌ కానిస్టేబుల్‌ వెంకటేష్‌ ఈనెల12న రాయికల్‌లోని రామేశ్వరం దేవాలయంలో రెండో వివాహం చేసుకున్నాడు. ఏఎస్సై బాలస్వామి, కానిస్టేబుళ్లు అశోక్‌రెడ్డి, అమర్‌నాథ్‌, వెంకటేష్‌ గౌడ్‌, చంద్రమోహన్‌, హోంగార్డు రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం మందుతాగి చిందులేస్తూ హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టిలో పడడంతో స్పందించారు. మందేసి చిందేసిన పోలీసులను సైబరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Ranga Reddy District
Police constable
marriage
Telangana
  • Loading...

More Telugu News