south central railway: దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు : క్యూఆర్ కోడ్ సాయంతో సాధారణ టికెట్లు
- యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులోకి
- టికెట్ల విక్రయానికి ఇటీవలే ప్రవేశపెట్టిన యాప్
- స్టేషన్ పరిసరాల్లోని వారికి ఇదో సదుపాయం
సాధారణ ప్రయాణమైనా స్టేషన్‌కి వెళ్లి, క్యూలో నిల్చుని టికెట్ తీసుకునే అవస్థలు లేకుండా క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్) విధానంలో జనరల్ టికెట్లు తీసుకునే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అమల్లోకి తెచ్చింది. యాప్ ఉన్న వారు, స్టేషన్‌కు కిలోమీటర్ పరిధిలో ఉన్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. కాగిత రహిత సేవల లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే ఇటీవల యూటీఎస్ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిద్వారా ఇప్పటి వరకు రిజర్వ్‌డ్ ప్రయాణికులకే సదుపాయం అందుబాటులో ఉండగా, తాజాగా సాధారణ ప్రయాణికులకు వర్తింపజేసింది. దీనివల్ల టికెట్ తీసుకునేలోగా రైలు వచ్చేస్తుందేమో, అందుకోలేమెమో అన్న ఆందోళన ప్రయాణికులకు అవసరం ఉండదు.