Kurnool Police: "ఇదే నా చివరి మెసేజ్.." కర్నూలు పోలీస్ వాట్సాప్ గ్రూప్ లో ఎస్సై కలకలం!

SI Last Message in Kurnool Whats app Group

  • విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు
  • ఉన్నతాధికారులు పిలిపించారని మనస్తాపం
  • రుద్రవరం ఎస్సై కోసం గాలిస్తున్న పోలీసులు

కర్నూలు జిల్లా పోలీసుల వాట్సాప్ గ్రూప్ లో ఓ సబ్ ఇనస్పెక్టర్ పెట్టిన మెసేజ్ తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, రుద్రవరం ఎస్సై విష్ణు, "ఇదే నా చివరి మెసేజ్" అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఇటీవల తన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు విష్ణుపై రాగా, ఉన్నతాధికారులు పిలిపించారు. తాను ఎటువంటి తప్పు చేయకున్నా, తనను నిందిచడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని తన మెసేజ్ లో విష్ణు వాపోయాడు. ఈ మెసేజ్ గ్రూప్ లో చర్చనీయాంశం కాగా, ఈ ఉదయం నుంచి విష్ణు కనిపించకుండా పోయారు. దీంతో అతని ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి కూడా అతని సెల్ ఫోన్ రుద్రవరం పరిధిలోనే ఉండటం, తెల్లవారుజాము నుంచి స్విచ్చాఫ్ రావడంతో, ఆత్మహత్యకు ప్రయత్నించారా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నారు.

Kurnool Police
Whats App Group
Rudravaram
SI
Last Message
  • Loading...

More Telugu News