తన సాంగ్ ను తానే రీమిక్స్ చేయించుకోనున్న బాలకృష్ణ... బోయపాటికి ఆదేశం!
- దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన 'బంగారు బుల్లోడు'
- రవీనాతో కలిసి 'స్వాతిలో ముత్యమంత..' పాట
- అదే పాట ఇప్పుడు అంజలితో కలిసి చేయనున్న బాలయ్య
ఇంతకీ అదే పాటో తెలుసా? సూపర్ హిట్ సినిమా 'బంగారు బుల్లోడు'లోని "స్వాతిలో ముత్యమంత ముద్దులా..." దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా, అప్పట్లో పెద్ద హిట్. ఇక ఈ సాంగ్ లో రవీనా టాండన్ తో కలిసి బాలయ్య వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేశారు. ఇప్పుడిక అదే పాటను బాలకృష్ణ, అంజలి మీద చిత్రీకరించేందుకు బోయపాటి ఏర్పాట్లు చేస్తున్నారట. కాగా, ఈ పాటను ఇప్పటికే అల్లరి నరేశ్ రీమిక్స్ చేయించాడు.