Hyderabad: ఉలిక్కిపడిన మలక్‌పేట.. అర్ధరాత్రి వేళ భారీ పేలుడు

Gas Cylinder blasted In Malakpet

  • మూడంతస్తుల భవనంలో పేలుడు
  • భవన కాపలాదారు, అతడి కుటుంబ సభ్యులకు గాయాలు
  • ధ్వంసమైన కార్లు, ఇతర వాహనాలు

భారీ పేలుడుతో హైదరాబాద్‌లోని మలక్‌పేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అస్మన్‌గఢ్‌లోని ఓ మూడంతస్తుల భవనంలో గత అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. భవనానికి కాపాలా ఉండే వ్యక్తి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీకైంది. అదే సమయంలో ఫ్రిడ్జ్ నుంచి నిప్పు రవ్వలు ఎగిరిపడడంతో సిలిండర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది.

పేలుడు ధాటికి ఇంటి కిటికీ, తలుపులకు ఉన్న అద్దాలు, సమీపంలోని కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని కిటికి అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గాయపడిన సెక్యూరిటీ గార్డుతోపాటు అతడి కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి వేళ భారీ పేలుడు సంభవించడంతో ఏ జరిగిందో తెలియక స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Hyderabad
Malkpet
Blast
Gas Cylinder
  • Loading...

More Telugu News