Telugu teacher: రిటైర్మెంట్ వేళ.. పల్లకిలో ఊరంతా ఉరేగింపు.. రావులపాలెం తెలుగు ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

Ravulapalem Telugu Teacher gets Unforgettable Memory

  • 19 ఏళ్లపాటు ఒకే పాఠశాలలో సేవలు
  • సమున్నతంగా గౌరవించిన విద్యార్థులు
  • సన్మాన కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు

19  సంవత్సరాలపాటు ఒకే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా సేవలు అందించి రిటైరైన ఆయనకు విద్యార్థులు ఊహించని విధంగా గౌరవించారు. పల్లకిలో కూర్చోబెట్టి తమ భుజాలపై మోసుకుంటూ ఊరంతా ఊరేగించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిందీ ఘటన. చోడే వెంకటేశ్వర ప్రకాశం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 19 సంవత్సరాల పాటు ఇదే పాఠశాలలో సేవలు అందించిన ఆయన నిన్న రిటైరయ్యారు. సుదీర్ఘకాలం సేవలు అందించిన ఆయనను సమున్నతంగా గౌరవించాలని భావించిన విద్యార్థులు మాస్టారిని పల్లకిలో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించారు. ఆ తర్వాత పాఠశాల ప్రాంగణంలో సత్కారించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Telugu teacher
East Godavari District
Ravulapalem
  • Loading...

More Telugu News