Dubai: విశాఖ విమానాశ్రయంలో రూ.51 లక్షల విలువైన బంగారం పట్టివేత

Police seized gold biscuits in Visakhapatnam Air port

  • దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు
  • పది బంగారం బిస్కెట్లు స్వాధీనం
  • ప్రవర్తన అనుమానంగా ఉండడంతో తనిఖీ చేసిన అధికారులు

దుబాయ్ నుంచి విశాఖ వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన నూరుల్ హుడా, రఫాఖత్ అలీల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అధికారులు తనిఖీ చేశారు. వారి నుంచి రూ.51.5 లక్షల విలువైన పది బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

Dubai
Gold
Visakhapatnam District
Andhra Pradesh
  • Loading...

More Telugu News